సహదేశవాసులారా, తెలుగుప్రజల ఐక్యత కోసం, కేసీఆర్‌కు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా (29 వ తారీఖు నుండి) చెన్నైలో "భారతీయ తెలుగు సమాఖ్య" ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఎల్లుండితో ఆ దీక్షలు ముగుస్తాయి. కావున, ఎల్లుండి చెన్నైలో బయలుదేరి, తిరుపతి వరకు పాదయాత్ర చేసి, తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అవకాశమున్నవారు ఈ పాదయాత్రలో పాల్గొనవలసినదిగా మనవి.
వివరాలకు సంప్రదించండి: నగేష్ 9444009747 (ఇండియన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్ష్యుడు).
వినడానికి అవకాశమున్నవారు, ఈ క్రింద ఉన్న ఆడియో ద్వారా వినండి.
పరమేశ్వర రావు గారు అనేక గ్రామాలు తిరిగారు. కేవలం సైకిలు మీద తిరగడమే.
పరమేశ్వర రావు గారు: ఏమ్మా మీ పిల్లలు ఎలా చదువుతుంటారు? గ్రామంలోని మహిళలు: ఏం పిల్లలు చదవడమండి. మాకు ఒకే మాష్టారు. ఏకోపాధ్యాయ పాఠశాల. ఒక్క అక్షరం ముక్క రాలేదండి. కావలంటే, మా పిల్లలకి మీరు పరీక్ష చేయండి అని చెప్పి పిల్లలను కూర్చోబెట్టారు ఆయనకు ఎదురుగా. వాళ్ళకు A,B,C,D,E,F,G,H,I ఆగిపోతుంది. అక్షరాలు కూడా తెలియవు.
ప.రా. గారు: ఏమి చదువుతున్నారు? గ్రా.మ: నాలుగవ తరగతి?
ప.రా. గారు: నాలుగవ తరగతి చదువుతున్నావు. అక్షరాలు నోటివెంట చెప్పడం రాదరా?
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, క, ఖ, గ, ఘ, ఙ అయిపోయింది. ఇదేంట్రా, ఇదేం బడిరా బాబు అని పరిస్థితి.
గ్రా.మ: ఆ మాష్టారు ఏమీ చెప్పడం లేదండి. ఒకసారి ఆ మాష్టారు గారితో చెప్పండి బాబూ, మీరు చదువుకున్నవాళ్ళు కదా, మీరు చెబితే కాస్త చేస్తాడు బాబు.
ప.రా. గారు: నేనెందుకు చెబుతాను. నేను చెప్పను.
గ్రా.మ: మరి మీరూ చెప్పక, మేమూ చెప్పక........
ప.రా. గారు: మరి మీరే చెప్పొచ్చు కదా.
గ్రా.మ: మేము చెప్పాం బాబు, కంప్లైంట్ రాసుకో, కావాలంటే, కంప్లైంట్ నేను రాసిస్తాను, ఎవడికి రాయమంటావో చెప్పు, అని గదమాయించి తిట్టి పారేశాడండి ఆయన. ఈ మాత్రం దిక్కు కూడా ఉండదు. ఈ మాష్టారు కూడా ఉండడు. రెండు మైళ్ళ దూరం నుండి నేను సైకిలు తొక్కుకుంటూ వస్తున్నాను చచ్చిచెడీ మీకోసం. చెప్పినదాంతో సంతోష పడండి. నాకిచ్చే ముష్టి జీతానికి ఈ మాత్రం చెప్పడమే చాలంటున్నాడండి.
ప.రా. గారు: ఒక పని చేద్దామండి అయితే, నేను చెప్పినట్లు చేస్తారా అయితే?.
గ్రా.మ: చేస్తాం
ప.రా. గారు: మీరు మహిళామండలి అని చెప్పి, ఒక మహిళా సంఘం అని ఏర్పడ్డారు కదా? ఎంత మంది ఉన్నారు?
గ్రా.మ: పదహారు మంది ఉన్నామండి.
ప.రా. గారు: నలుగురు చాలు. పూటకు నలుగురు. ఈ పూట నలుగురు. మళ్ళీ మధ్యాహ్నం పూట నలుగురు. మళ్ళీ మర్నాడు ఇంకో నలుగురు. అలా బ్యాచులు మారొచ్చు. మీలో ఎవరి నలుగురికి వీలుంటే వాళ్ళే కూర్చోవచ్చు.
గ్రా.మ: ఏమి చెయ్యాలి బాబు. ఏమి చెయ్యాలి బాబు. మేమేమి చదువుకోలేదు బాబు. మేమేమి చెయ్యగలం.
ప.రా. గారు: ఏమీ చెయ్యనఖ్ఖరలేదు. ఆ పాఠశాల ఎదురుగా అఱుగు ఉంది కదా.? ఆ మాష్టారు కనిపించేటట్లుగా. ఆ అఱుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోండి చాలు.
గ్రా.మ: అదేంటి బాబు అఱుగు మీద కూర్చొని కబుర్లు చెప్పమంటున్నారు?
ప.రా. గారు: మీరు కూర్చొని కబుర్లు చెప్పుకోండి. గచ్చకాయలు ఆడుకోండి. మాష్టారు వంక ఇలా చూస్తూ కూర్చోండి. అంతే! ఇంక ఏమీ చెయ్యనఖ్ఖరలేదు.
గ్రా.మ: ఓహో! ఏమిటి? ఈ బాబేదో చెబుతున్నాడు. అక్కడ కూర్చోమని. ఆఁ కుక్క కాపలా. ఆ మాష్టారు ఏమి చేస్తాడు?. ఏమీ చెయ్యడు. వెళ్ళి అడిగితేనే దిక్కులేదు. అట్టాంటిది వెళ్ళి కూర్చుంటే వింటాడా? నీ దిక్కున్న చోట కంప్లైంట్ చేసుకోమన్నాడు ఆయన. ఈ పిచ్చి బాబేదో చెబుతున్నాడు. మనం పిచ్చోళ్ళమై వింటున్నాము. ఏమీ అఖ్ఖరలేదులే అన్నారు.
ప.రా. గారు: అఖ్ఖరలేకపోతే, సరే! వెళ్ళిపోండమ్మా.
గ్రా.మ: రెండు రోజులు పోయిన తర్వాత పోనీ! కూర్చుంటే మనకేం పోయింది. మనకు నష్టమేం లేదు కదా అని అంది ఒకామె అందులో. సరే! కూర్చున్నామయితే అన్నారు అందరూ. అని చెప్పి మర్నాడు వెళ్ళి బళ్ళో పిల్లలను దింపేసి కూర్చున్నారు అందరూ.
ఏమీ లేదు. ఇలా కూర్చువడం. ఆయన వంక చూస్తూ ఉండటం.
మాష్టారు తర్వాత ఎప్పుడో వచ్చాడు. కాళ్ళు జాపుకొని, బళ్ళ మీద కాళ్ళు జాపుకున్నాడు. రెండు గంటలు పడుతుంది ఆయనకు, వాళ్ళ ఊరి నుంచి అతను పని చేసే బడికి రావడానికి. కొన్ని మైళ్ళ దూరంలో ఉంది వాళ్ళ ఊరు. సైకిలు మీదొచ్చి అలసిపోయి, కాళ్ళు పైన పెట్టుకొని, అరేయ్! టీ తీసుకురండ్రా, టీ చెప్పి తీసుకురారా అని చెప్పి ఒక కుర్రాణ్ణి పంపిస్తాడు. టీ వస్తుంది. ఆ టీ తాగుతాడు. ఆ టీ తాగడానికి కాళ్ళు క్రిందపెట్టి అంతా అయ్యాక దగ్గర దగ్గర మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత రిజిష్టరు తీసుకురండ్రా అంటాడు. రిజిష్టరులో పేర్లు అవీ ఒకసారి చూస్తాడు. ఏమైనా అటెండెన్సు వెయ్యాల్సినవి చూస్తాడు. ఆ తర్వాత తాపీగా ఒక గంట రెండు గంటలు పడుకుంటాడు. అది మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో చేస్తాడు. చదువుచెప్పడమనేది లేదు ఇందులో. ఇలా గడిచిపోయింది రోజంతా. వీళ్ళు ఏమీ అనడం లేదు.
ఏమీ అనకూడదు అని చెప్పారు పరమేశ్వర రావుగారు. ఏమీ మాట్లాడకూడదు. ఏమీ చెయ్యకూడదు. మీలో మీరు ఏవైనా కబుర్లు చెప్పుకోండి. సరే! వీళ్ళోస్తున్నారు. మాష్టారి వంక చూస్తున్నారు, కూర్చుంటున్నారు.
ఆ మాష్టారు రోజంతా చూశారు. వీళ్ళు వెళ్ళలేదు. రెండో రోజూ చూశాడు. మళ్ళీ ఇలాగే ఉంది పరిస్థితి. మూడో రోజు వచ్చాడు. నాలుగో రోజూ వచ్చాడు. పరిస్థితిలో ఏ మార్పూ లేదు. అయిదో రోజు వచ్చేసరికి, ఆ మాష్టారు కరెక్టు టైముకు వచ్చేశారు బడికి. కాళ్ళు క్రింద పెట్టడం మొదలుపెట్టారు. బల్ల మీద నుంచి కాళ్ళు తీసి క్రింద పెడుతున్నాడు. ఆరవ రోజు పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలచేత టీ తెప్పించుకోవడం మానేశాడు. పదోరోజు వచ్చేసరి కల్లా ఫుల్ లెంగ్త్ పాఠం చెబుతున్నాడు ఆయన. మొదటి నుంచి చివరి దాకా. ఆ రోజు నుంచి పదిరోజుల పాటు ఆ మహిళలు అలాగే కూర్చున్నారు. ఇంక ఇప్పుడు వీళ్ళకు విసుగుపుట్టింది. విసుగుపుట్టి, ఇంక వీళ్ళు వెళ్ళడం మానేశారు. మానేసి, ఇంకో పది రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారు. వెళితే ఆ మాష్టారు పాఠాలు బానే చెప్పేస్తున్నాడు. వీళ్ళు మానేసిన రోజున ఎలా చెబుతున్నాడో, అలాగే చెబుతున్నాడు.
మళ్ళీ పరమేశ్వరరావు గారు ఆ ఊరికి వెళ్ళారు.
ప.రా. గారు: ఏమ్మా ఎలా ఉన్నారు?.
గ్రా.మ: బాబూ. ఏమి బాబు. ఎంత మార్పు వచ్చేసింది బాబు ఆ పంతుల్లోను. ఎంత అధ్బుతంగా చేసేస్తున్నారు బాబూ! బ్రహ్మాండంగా చదువు చెబుతున్నాడు. ఇప్పుడు మా పిల్లలను పరీక్షించండి బాబూ అని చెప్పి, వాళ్ళను కూర్చోబెడితే, ఆ పిల్లలు టపా టపా టపా పద్యాలు గిద్యాలు అన్నీ చెప్పేస్తున్నారు.
ఎట్లా వచ్చింది మార్పు అంటే, కేవలం ఒక చిన్న అజమాయిషి. నోటితో చూస్తే చాలు. మీరు తుపాకులు పట్టుకొని, గొడ్డల్లు పట్టుకుని, కొడవళ్ళు పట్టుకొని పరిగెత్తఖ్ఖరలేదు. అసలు చూస్తే చాలు మీరు. ఆ మార్పు వచ్చేసింది.
ఆ తర్వాత ఆ మహిళలు ఇంకో రోజు వెళితే, ఏవమ్మా రోజూ వచ్చే వాళ్ళు. మీరు రాకపోతే నాకూ తోచడం లేదు. నేనూ తప్పు చేశాను. పిల్లలకు పాఠాలు చెప్పకుండా. ఏమి చేస్తాను. అంత దూరాన ఇళ్ళు. ఇంత దూరం రావాలంటే, వచ్చేసరికి అలసిపోతున్నాను. మీరు రాకపోతే కాళ్ళు పిసికిచ్చుకునే వాణ్ణి పిల్లలచేత. మరి ఇప్పుడు కాస్త నాక్కూడా ఉత్సాహంగా ఉంది. పాఠాలు చెప్తున్నాననే తృప్తి ఉంది. మీరు రాబట్టే అది జరిగింది.
మీరొచ్చి చూస్తున్నారనే ధ్యాసతోనే నేను ఇలా చేశాను. మీరు వస్తూ ఉండండి కాస్త. నాక్కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఎవ్వరూ చూడకపోతే, ఎందుకు చెయ్యడం, ఈ దిక్కుమాలిన పాఠాలు చెప్పడం. ఎవడి కోసం అనిపిస్తుంది నాక్కూడా. కాస్త వస్తూ ఉండండమ్మా అని అన్నారట ఆ మాష్టారు వీళ్ళతో.
నిశ్శబ్ద విప్లవం అంటే ఎలా ఉంటుంది అనే దానికి ఇదో ఉదాహరణ.